menu

Responsive Topnav with Dropdown

Saturday, September 19, 2026

KP ASTROLOGY అంటే ఏమిటి? పూర్తి వివరాలతో తెలుసుకొండి

 



 


క్రిష్ణమూర్తి పద్ధతి అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ద్వార మానవుడు తన భవిష్యత్తును గురించి జ్ఞానాన్ని పొందుతాడు.  జీవితంలో కొన్ని విషయాలు అనుభూతిలోనికి వచ్చేది ఎప్పుడు? ఎంత మోతాదులో  ఉండుంది? ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి జ్యోతిష్యం తప్ప వేరే శాస్త్రాలు లేవు.

సంప్రదాయ పద్ధతి నుండి కొద్దిగా దారి మళ్ళించి సత్యనేవ్షణలో  ఖచ్చితత్వానికి వీలైనంత దగ్గరంగా ఎక్కవ శాతంతో ఫలితం ఎచ్చె రీతేలో కృష్ణమూర్తి పద్ధతి మనకు తోడ్పడుతుంది. 

ఈ పద్దతిని అధ్యనం చేసినారు శ్రీ క్రిష్ణమూర్హి గారు చెప్పిన పద్దతిలో రాశి భావచక్రం వాటి  గ్రహస్థితిని తయారుచేసుకొని ఒక పని జరిగేది లేనిది, ఎప్పుడు జరిగేది ఇత్యాది విషయాలను ఖచ్చితంగా  చాలా సులభంగా చెప్పగలరు. 


క్రిష్ణమూర్తి  పద్దతిని సరియైన ఫలితాలు ఉంటాయా? ఎంతవరకు ఈ పద్ధతి నమ్మవచ్చును?


మానవుడు ఎల్లప్పుడూ సత్యాన్వేషి.  ఈ జ్యోతిష్యంలో ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాలు ద్వారా ప్రయత్నం చేయాలి.  జ్యోతిష శాస్త్రాన్నిలో భవిష్యత్తు ఫలితా నిర్ణయానికి ఎన్నో సిద్దాంతాలు ఉన్నాయి.  ఒక్కక్కటి ఒక్కక్క గారిలో సాగుతుంది.  ఆ దారులన్నియు గుర్తిమ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నాయి.  అయినా సరైన ఫలితాలు రావడం లేదు.  చెప్పేది ఒక్కటి జరిగేది ఒక్కతి.  అందుకనే మన హిందూ సంప్రదాయ జ్యోతిష్యం మీద కొందరికి నమ్మకం కలుగట లేదు. 

శ్రీ కృష్ణమూర్తి గారు నిరంతరం కృషిచేసి జ్యోతిష శాస్త్రంను సులభతరం చేసినారు.  వారు దీనికి ఆయన పేరు మీదుగానే పెట్టుకొన్నారు. వారి కీనికి "కృష్ణమూర్తి పద్ధతి" అని పేరు పెట్టినారు.  ఈ పద్దతిలో కారకాల పట్టిక తయారు చేయడం, సబ్ ని విశ్లేషించడం, రూలింగ్ ప్లానెట్ సహాయం తీసుకోవడం ద్వారా ఈ విధానం సులభతరం అయినది అందుచేత ఈ పద్ధతిని నూటికి నూరు పాళ్ళు నమ్మవచ్చును. ఆచరించవచ్చును. 


 కే.పి.లో రూలింగ్ గ్రహాలు - వాటి ప్రాముఖ్యత 

కే.పి. పద్దతిలోని మరియొక్క ముఖ్యంశము. సమయ పరిపాలిత గ్రహాలు (Ruling Planets).  గ్రహముల నిరంతరము సంచరిస్తూనే వుంటాయి.  కాని స్థిరముగా ఉండవు.  కనుక దినములో ప్రతి క్షణములోను  కూడా భూమిపై నున్న ప్రతి బిందువు పైన ప్రభావము చుపుచున్న గ్రహములు మారుతూనే ఉంటాయి అన్న మూల సిద్దాంతము.  దీనిని అనుసరించి ఒక సమయంలో తూర్పు దిక్కున ఉదయించి లగ్నము, చంద్రుల స్ధితి హెచ్చుగా ప్రభావము చూపుతూ మారుతూ ఉంటుంది.  కనుక ఆసమయములో 

1) వారాదిపతి  (Day Lord)
2) చంద్ర రాశి  ( Moon Sign Lord)
3) చంద్ర నక్షత్రనాధుడు (Moon Nakshatra Lord)
4) లగ్న నాధుడు (Lagna Lord)
5) లగ్న నక్షత్రనాధుడు  (Lagna Nakshatra Lord)

వీరు రూలింగ్ గ్రహములుగా  పేర్కొనబడిరి. 

ఏదైనా ఒక అంశము పరిశీలించినప్పుడు ఉన్న రూలింగు గ్రహములు పరిశీలింపబడే  అంశము జరిగిన సమయంలో ఉన్న గ్రహ దశా కాలముతో సరిపోతున్నది సూత్రము. 



తరచుగా అడిగే ప్రశ్నలు - FAQ

జాతక పరిశీలినకు చేయుటకు ఏమి కావాలి?
జాతక పరిశీలన చేసే టప్పుడుపుట్టిన తేది, పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశం కావాలి.
కంప్యూటర్ జాతకం నమ్మవచ్చా? చూడవచ్చా?
కంప్యూటర్ మీద జ్యోతిష్యం చూడవచ్చు. నిజంగా ఇది మంచి పనే. సరియైన పంచాగం దొరికి, ఓపికగా లెక్కవేసి లగ్నాది, భావాలను, గ్రహస్పుటం, నవాంశ చక్రం వగైర వింశోత్తరదశ క్రమము వ్రాసుకోవటం చాలా శ్రమతో కూడిన పని. అందుచేత గణితం కొరకు మాత్రమె కంప్యూటర్ జ్యోతిష్యం ప్రింటు చేసుకొనవచ్చును. దీని వలన జ్యోతిష్కునికి శ్రమ మరియు కాలము కలిసివచ్చును. కాని ఫలితములు విశ్లేషించడం పనికి రాదు.
జ్యోతిష్యం అంటే ఉహించి చెప్పే శాస్త్రమని కొందరి అభిప్రాయమా?
ఇది సరైన ఆలోచన కాదు. జ్యోతిష్యం చెప్పడానికి గణితం వేస్తె చాలదు. దానికి తోడు ఉపాసనా బలం చాలా అవసరం ఎందుకంటే ఉపాసనకు అనేక విషయ సంకులమైన శాస్త్రం నడలి విషయాలు సేకరించి ఉపాసనా దేవత అందిస్తుంది. అందుచేత అలౌకికమైన విద్యలు చదివినంత మాత్రాన్న చాలవు. వీటికి సాధన ఏకాగ్రత ఉంటేనే ఎవరైనా సాదించవచ్చు.
ప్రతి జ్యోతిష్యుడు దగ్గర ఏ ఏ గ్రంద్రములు అవసరము?
పరాశర, జైముని, శ్రీపతి, గౌతముడు, నారదుడు, మొదలగు మహర్షులు యొక్క సిద్దాంతమును బాగుగా ఎవరు అభ్యసించేదరో వారే ఈ శాస్త్రమును వచించుటకు అర్హులు. అట్టి వారికి మాత్రమె ఈ శాస్త్రము యొక్క గొప్పతనము తెలియును. అనుటలో సందేహము లేదు. అందుచేత వారి వ్రాసిన గ్రంధములు ప్రతి జ్యోతిష్కుడు దగ్గర ఉండవలసిన అవరము ఉన్నది.
కర్మ ఆచరించుటయే నీ ధర్మమా?
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం -- సుఖ దుఖాలను, జయాపజయాలు, లాభానష్టములను సమానంగా భావించు. కర్మము ఒనర్చుటకు మాత్రమె నీకు అధికారము ఉంది. కర్మ ఫలములందు ఆసక్తి ఉండకూడదు.ఫలప్రాప్తి కోసం నీవెప్పుడు పనిచేయవద్దు. ఆలా అని కర్మ చేయకుండా ఉండకు. సమభావంతో ఫలాసక్తిని విడిచి కర్మకు ఆచరించు. ఇటువంటి సమబుద్దితో కర్మను ఆచరించే వారు ఈ జన్మలోనే పుణ్యపాపాల్లు నుంచి విముక్తులవుతారు.


Internal Linking Structure:


* 1) కృష్ణమూర్తిగారు జ్యోతిష్యం ఎల్లా పనిచేస్తుంది? సులభమైన వివరణ
* 2) కృష్ణమూర్తిగారు రాశి, నక్షత్రం, సబ్ లార్డ్ అంటే ఏమిటి?
* 3) కృష్ణమూర్తి పద్దతిలో భావ చార్ట్ అంటే ఏమిటి?
* 4) కృష్ణమూర్తి పద్దతిలో 12 భావాలూ ఎందుకు ముఖ్యమైనది.
* 5) కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికేటర్ అంటే ఏమిటి?