menu

Responsive Topnav with Dropdown

Saturday, September 19, 2026

KP ASTROLOGY అంటే ఏమిటి? పూర్తి వివరాలతో తెలుసుకొండి

 

 జ్యోతిష శాస్త్రం ద్వారా మానవుడు తన భవిష్యతును గురించిన జ్ఞానాన్ని పొందుతారు. జీవితంలో కొన్ని విషయాలు అనుభుతిలోనికి వచ్చేది ఎప్పుడు.?   ఇలాంటి ప్రశ్నలకు తెలుసుకోవడానికి జ్యోతిష్యం తప్ప వేరే శాస్త్రములు లేవు. ఈ సమయంలో భారతీయ శాస్త్రములు సహేతుకరమైన సిద్దాంతములనియు అవి శాస్త్రములే గాని మూడ నమ్మకపు సూత్ర నిర్ణయములు కావని నిరూపించేందుకు  దిశగా మేధావుల పరిశోధనాత్మక  కృషి యొక్క రూపాంతరమే “నక్షత్ర జ్యోతిష్య పద్ధతి”  “స్టేల్లర్  ఆస్ట్రాలజీ” “కే.పి. పద్ధతి” “కే.పి.ఆస్ట్రాలజీ” అని పేరు పెట్టినారు. దీనిని మద్రాసు (ఇప్పుడు చెన్నై) నివాసి శ్రీ కే.యస్.కృష్ణమూర్తి గారు 40 సం||ల పాటు  నిరంతరము శోదన చేసి నిర్ణయ సిద్ధాంతం.  దీనిని అయన పేరు మీదుగా ప్రచారములోనికి తెచ్చి ఆధునిక యుగములో అత్యంత నిబద్దతను కలిగిన  శాస్త్రముగా మన జ్యోతిష్యశాస్త్రము నిరూపించారు.

 శ్రీ కే.పి. కృష్ణమూర్తిగారు ఆవిష్కరించిన నూతన జ్యోతిష్య విధానం కే.పి. జ్యోతిష్యంగా దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఏంతో మంది చాల ఖచ్చితంగా భవిష్య ఫలితాలు చెప్పడంలో పట్టుసాధించారు.  ఈ కే.పి. పద్ధతిని అధ్యయనం చేసినవారు తప్పక గ్రహస్టితిని తయారు చేసుకొని ఒక పని జరిగేది లేనిది, ఎప్పుడు జరిగేది మొదలగు విషయములు కచ్చితంగా సులభముగా చెప్పగలరు. వీరు కే.పి. పద్ధతి ప్రకారము గ్రహముతో నున్న భావము యొక్క ఫలితములను కాక తానున్న నక్షత్రనాదుడు ఉన్న భావము యొక్క ఫలమును ప్రధానంగా ఇస్తాడు అన్నది ముఖ్యాంశం.  

 జ్యోతిష్య శాస్త్రంలో భవిష్యత్తు ఫలిత నిర్ణయానికి ఎన్నో సిద్దాంతాలు ఉంటాయి. ఒక్కక్కటి ఒక్కొక్క దారిలో సాగుతుంది.  ఏ పద్ధతి విధానమైనా అనుసరించే సమయంలో ఆ విధానంపై అధికారం సంపాదిస్తే ఖచ్చితంగా ఫలితంగా చెప్పవచ్చు.  కృష్ణముర్తి పద్దతిలో ఇది సులభతరం చేయబడినది. కారకాల పట్టిక తయారు చేయడం, సబ్ ని విశ్లేషించడం,  రూలింగ్ ప్లానెట్ సహాయం తీసుకోవడం ద్వారా ఈ విధానం సులభతరం అయినది.   మనము కొంత ఏకాగ్రత, పరిమితమైన సిద్దాంతం జ్ఞానం ఉంటె చాలు. జరిగేది, జరుగనిది, ఎప్పుడు జరిగేది నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా చెప్పవచ్చు. 

 ఉదారణకు:

కర్కాటక లగ్న జాతకులకు మేష రాశిలో కృత్తికా నక్షత్రమునందు రవిగురులు ఉన్నారనుకుంటే పై గ్రహములు దశామమునందు  ఉండుట జరుగుతుంది.  అప్పుడు గురుడు ద్వీతీయాదిపతి దశామమందున్నందున దశమ భావం యొక్క అంశముల ఫలితములను ప్రధానంగాను ( అంటే బలీయంగాను) ద్వితీయ భావ తనూ భావములను తరువాత ప్రాధన్యతలోను తరువాత తన యొక్క అధిపత్యములోని 6వ, 9వ స్తానముల యొక్క ఫలములను నిచ్చును. ఇక్కడ గురుడు దశమములో నున్నందున అఫలములనే ఇస్తాడు అనవచ్చును.  అందువల్ల మరియొక ఉదాహరణ  ఇదే జాతకంలో శుక్రుడు మీనంలో రేవతినక్షత్ర స్థితి కలిగియున్నాడు.  అప్పుడు శుక్రుడు చతుర్ధ లాభాధిపతి రేవతి నక్షత్రనాధుడు బుధుడు సదరు లగ్నమునకు తృతీయ వ్యయాధిపతి మీనం భాగ్యస్థానం.  కనుక శుక్రుడు లాభాధిపతి అయి ఉన్నాడు.  బుధుని నక్షత్ర స్తితి వలన ప్రధానంగా తృతీయ వ్యయా భావముల యొక్క ఫలమునిచ్చును. 


ఇక్కడ పరిశీలించవలసిన విషయం ఏమిటంటే నక్షత్రాదిపతి కన్నా నక్షత్ర స్థితి గ్రహము బలీయమైనది.  అలాగే భావాదిపతి కన్నా భావస్థితి( అంటే సిగ్నిఫికేటర్) గ్రహము బలవంతమైనది. భావములో ఏ గ్రహము లేనప్పుడు భావాదిపతి, అలాగే నక్షత్రములో ఎవరు లేనపుడు నక్షత్రాతిపతి సదరు ఫలితములను నిర్నయంచుటలో బలవంతులగుడురు. 


చివరగా నేను చెప్పేదేమిటంటే కే.పి. సిస్టం ద్వారా నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా ఫలితం చెప్పగలమనే ధీమా ఉన్న ఈ నాటి జ్యోతిష్య పండితులు కూడా  కొన్ని సందర్బాలలో తప్పులు దొర్లడం గమనించే ఉంటారు.  యాహు గ్రూపులు మెసేజల ద్వారా మనకిది అవగాతమోతుంది. దానిని సరే చేసే ప్రయత్నాలలో భాగంగా మల్టీ స్టేల్లర్ ధియరీ, పోరు స్టెప్ తీయరి, కుల్లర్ ఇంటర్ లింక్స్ తీయరీ మొదలైనవి ఈ రోజుల్లో ప్రాచుర్యాన్ని వహిస్తున్నాయి.

No comments: